నాగవల్లిలో చంద్రముఖి ఎవరో తెలిసిపోయిందోచ్..!?

వెంకటేష్ హీరోగా ‘చంద్రముఖి2’ అయిన ‘నాగవల్లి’ రూపొందుతోన్న విషయం తెలిసిందే. పి వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క , కమలినీ ముఖర్జీ , రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్, పూనమ్ కౌర్ నటిస్తున్నారు. ఇంతమందిలో చంద్రముఖి ఎవరు? అనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపద్యంలో ఈ చిత్రంలో అనుష్క ఫోటో ఒకటి విడుదల అయ్యింది. తను భరతనాట్యం డ్రెస్ లో ఉంది. దాంతో ఈ చిత్రంలో అనుష్కే చంద్రముఖి అని చాలామంది నిర్థారణకు వస్తున్నారు. అలాగే కమలిని ముఖర్జీకి సంబంధించిన ఒక స్టిల్ విడుదలయ్యింది. ఆ స్టిల్ చూసి ఒకవేళ జ్యోతిక చేసిన క్యారెక్టర్ కమలినీ చేస్తుందేమోనని, చంద్రముఖిగా అనుష్క చెస్తోందేమోనని మాట్లాడుకుంటున్నారు.

No comments:

Post a Comment