ఊరిస్తోన్న రామ్ గోపాల్ వర్మ 'రక్త చరిత్ర పార్ట్-2'
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘రక్తచరిత్ర పార్ట్-2’ తర్వలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ ఇప్పటికే ఆరంభమయ్యింది. ఇటీవల సూర్య ను హైలెట్ చేస్తూ కొన్ని పోస్టర్స్ ను రామూ విడుదల చేసాడు. ఈ పోస్టర్స్ లో టైటిల్ కింద ట్యాగ్ లైన్ గా ‘ఆప్టర్ రోబో..ది రజనీ’, ‘ఇట్స్ సూర్య..ది గజనీ’ అంటూ ముద్రించాడు. ఈ ట్యాగ్ లైన్ గురించి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోందట. అందుకని సూర్య చాలా అసంతప్తిగా ఉన్నాడని సమాచారం. ఆ ట్యాగ్ లైన్ ని తీసేయమని రామూని సూర్య కోరాడట. రజనీతోనో, అమీర్ ఖాన్ తోనో తనని కంపేర్ చెయ్యొద్దని కూడా రామూతో సూర్య చెప్పాడని వినికిడి. కాగా ‘రక్తచరిత్ర’ పార్ట్ వన్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. రక్తచరిత్ర రెండో భాగం ఈ నెల19న విడుదలవుతుందని ఆ సినిమా చివర్లో వేయడం కూడా సినీ ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని కలిగించింది. అయితే రామ్ గోపాల్ వర్మ చేష్టలు ఇప్పుడు ప్రేక్షకుల ఇష్టాయిష్టాలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. రోజు రోజుకూ ఊరిస్తున్నాయి. అసలు ప్రియమణి పాత్ర ఎలా ఉంటుంది? సూర్య ఎలా చేశాడు?వివేక్ ఒబేరాయ్ అదే..అదే పరిటాల రవి తదనంతర కథనం ఏమిటి?వంటి విశేషాలన్నీ చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. గత కొన్నాళ్ళ వరకు ఈ సినిమా ఈ నెలాఖరుకు వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. కానీ తర్వాత ఈ సినిమా డిసెంబర్ కు వెళ్లిందని సమాచారం. ఈ నెలాఖరున రామ్ చరణ్ తేజ నటించిన ఆరెంజ్ ఈ నెలాఖరున విడుదల కానుండటంతో భయపడిన రామూ డిసెంబర్ కు వెళ్ళాడని సమాచారం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment